ఖానాపూర్ రైతుల కోసం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి – బీజేపీ డిమాండ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 (నిర్మల్ జిల్లా)ఖానాపూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుండి మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఖానాపూర్ అసెంబ్లీ ఎమ్మెల్యేను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేసింది. రైతులు ఎంతో కష్టపడి పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు సహాయం చేయాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో రైతులకు అన్యాయం జరిగిందని, రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పండించిన పంటకు సరైన ధర కూడా లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల ఉపేందర్ మాట్లాడుతూ, ఖానాపూర్‌లో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే, రైతాంగంతో కలిసి ఖానాపూర్ మార్కెట్ యార్డ్‌ను ముట్టడి చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాలేరి విలాస్, బట్టు వరుణ్, కాలేరి రాజేందర్, కొప్పుల భీమేష్, సింగం వెంకటేష్, నెరేళ్ల రాజేందర్, వొడ్నిల బు