ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 12, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, పూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఉపాధ్యక్షులు మల్యాల బాల నరసయ్య అధ్యక్షతన జరిగ ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు బీసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలు తమ దోపిడి విధానాలకు సామాన్య ప్రజల సమ్మతిని రాబట్టడం కోసమే కృత్రిమంగా చాతురు వర్ణ వ్యవస్థను సృష్టించారని, అందులో దోపిడి చేసే వారికి పై స్థానాలను అంటగట్టి సంపద సృష్టి కర్తలైన శ్రామిక వర్గాలకు శుద్రులు, అతి శూద్రులు అనే పేర్లు తగిలించారని అన్నారు.ఆధిపత్య వర్గాలు దురాగవతాలను నిరోధించడానికి శ్రామిక వర్గ ప్రజలతో చైతన్యం తీసుకురావడానికి ఫూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధ సంస్థలు స్థాపించాడని, నిమ్న వర్గాల ప్రజలను కుల దోపిడీ నుంచి విముక్తి చేయడంతో పాటు రైతులు కూలీలను హక్కుల కోసం సంఘటిత పరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడని అన్నారు.విద్యా జ్ఞానులను అందుకోవడం ద్వారానే శూద్ర, అతిశూద్రులు తమ హక్కులను నిలబెట్టుకోగలరని గుర్తించి వారి విద్యా వ్యాప్తి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరిచిన మహా నాయకుడు పూలే అని అన్నారు.దళిత వర్గాల స్త్రీలకు సైతం విద్య అందాలనే ఉద్దేశంతో వారికోసం ప్రత్యేక పాఠశాలలు నడిపిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పైసా రాజశేఖర్, అల్వాల రాజు, పడమటి కేశపురం మాజీ సర్పంచ్ గిద్దల రమేష్, టిడిపి రాష్ట్ర నాయకులు అల్లాదుర్గం వెంకటేష్, ఎమ్మెస్పీ మండల ఇంచార్జ్ పాకాల కుమారస్వామి,మాజీ సర్పంచ్ నల్లగొని బాలకిషన్ గౌడ్, బిఎస్పీ మండల అధ్యక్షులు తమ్ముడి నవీన్, యూత్ నాయకులు మల్యాల అఖిల్ మాల, బల్లెపు యాదగిరి, గిరబోయిన బాల సిద్ధులు, తేలుకంటి శ్రీనివాస్, గంగరబోయిన సమ్మయ్య, పిన్న సురేందర్, తమ్మడి మహేందర్,ఎండీ షంషీర్, గంధమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.