చర్ల కొండాపూర్‌లో 112 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని చెర్ల కొండాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 112 గేదజాతి పశువులకు టీకాలు అందించబడినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దేవుని రవి, ఉప సర్పంచ్ ఆర్మూర్ లక్ష్మీనారాయణ హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే పాడి రైతులు ఆకుల గంగారెడ్డి, రాజేశం, దేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది మహమ్మద్ అజమ్ ఖాన్ (పశు వైద్య గణాంక సహాయకులు), గంగా చారి (జూనియర్ వెటర్నరీ ఆఫీసర్), శోభ గంగారం తదితరులు టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పశువుల ఆరోగ్య రక్షణ కోసం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అత్యంత అవసరమని, రైతులు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.