చలివేంద్రాన్ని ప్రారంభించిన తల్లాడ ఎస్సై ఎన్.వెంకటకృష్ణ

★ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మంగాపురం సర్పంచ్ దుగ్గిదేవర నాగ నరసింహారావు, ★ ఉప సర్పంచ్ గుజ్జలపూడి చింటూ

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 12 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల పరిధిలోని మంగాపురం గ్రామంలో రామాలయం సెంటర్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు మంగాపురం సర్పంచ్ దుగ్గిదేవర నాగ నరసింహారావు ఉపసర్పంచ్ గుజ్జలపూడి చింటూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన తల్లాడ ఎస్సై ఎన్ వెంకటకృష్ణ, సర్పంచ్ నరసింహారావు చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ మాట్లాడుతూ సర్పంచ్ ని అభినందిస్తూ గ్రామంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరారు. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రస్తుతం ఎండలు అత్యధికంగా ఉండటంతో ప్రజలకు చల్లని నీటిని అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు.ప్రజలు ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు కూడా ముందుకు రావాలి గ్రామంలో యువత కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సేవా కార్యక్రమంలో ముందు ఉండాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి జొన్నలగడ్డ పరుశురాం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.