జ్యోతిబాపూలే 200వ జయంతి: బిజినపల్లిలో ఘనంగా నిర్వహణ

కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు బిజినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడి, పూలే సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల సుబ్బయ్య (బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా నాయకులు), మంగి విజయ్, సభాధ్యక్షులు సత్యశీల సాగర్ అంతటి రాజేందర్ గౌడ్ దాసర్ల వెంకటస్వామి దేవరకొండ రామచందర్ మొలగర మహేందర్ వంగ రామన్ గౌడ్ శివ అల్లుజి అంతటి నాగన్న శ్రీనివాసులు అబ్బ కర్ణాకర్ ఉరుకొండ రఘుబాబు నరేందర్ గౌడ్ మైనార్టీ నాయకులు అమీర్ అజీమ్ వెంకటేష్ అడ్వకేట్ తిరుపతయ్య చంద్రన్న గౌడ్ మహిళా నాయకురాలు మాణిక్య చంద్రకళ సుధాకర్ భగవంతుల తిరుపతయ్య కరిగళ్ళ దశరథం సంతోష్ తిరుపతయ్య రమేష్ గోవిందు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, “విద్యే ఆయుధం” అనే ఆయన సందేశాన్ని నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక బీసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.