పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 కరీంనగర్ న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని 21వ డివిజన్లో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ కూడలిలో పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ పూలే గారి ఆశయ సాధన కోసం మనందరం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వంగల రవి, దయ్యాల మల్లేశం, చంద్రగిరి వేణు, లక్ష్మీ రాజం తదితరులు పాల్గొన్నారు.