టిడిపి యువ నాయకులు భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు,తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, మరియు యువ నాయకులు భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంస్కర్త. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యా విస్తరణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి మహిళల విద్యకు, దళితుల హక్కులకు బాటలు వేసిన మహోన్నత నాయకుడు పూలే ఆయన చూపించిన మార్గంలోనే మనం నడుస్తూ సమాజంలో సమానత్వం న్యాయం నెలకొల్పడానికి కృషి చేయాలి జ్యోతిరావు పూలే ఆశయాలు మనకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయి ఆయన జయంతి సందర్భంగా ఆయనకు మన ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన కలల సమాజ నిర్మాణానికి మనమందరం కట్టుబడి ఉండాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బత్తిని కుబేర్నాథ్, ఉరుకుంద డైరెక్టర్ రంగస్వామి, నాయకులు కర్నూలు పార్లమెంట్ టిడిపి వైస్ ప్రెసిడెంట్ రంగన్న, ఆదోని మండల అధ్యక్షులు శివప్ప, ఆదోని పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, క్లస్టర్ లక్ష్మీనారాయణ, క్లస్టర్ అంజి, ఆదోని మండల ప్రధాన కార్యదర్శి రంగన్న, ఎక్స్ కౌన్సిలర్ బాలాజీ, సిద్ధ, సంజీవ్, అయ్యన్న, అల్తాఫ్,కర్నూల్ పార్లమెంట్ టిడిపి కార్యదర్శి వీరేష్, శాదిక బేగం, శివ, గిడ్డయ్య, వెంకటేష్, వీర, జీవన్, నాగరాజ్, సాదేశ్, ఈరన్న, తదితరులు పాల్గొన్నారు