పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 12 పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ,ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తొండపు దశరథ జనార్ధన్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వీరికి ఆలయ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ చుంచు రమేష్ బాబు, *ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు ఆయనను దుశ్యాలవాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగు యువత నాయకులు గింజుపల్లి గోపి, పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాడపునేని సత్యంబాబు, తదితరులు పాల్గొన్నారు