పయనించే సూర్యుడున్యూస్ : ఏప్రిల్ 12 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) ప్రపంచ నరాల వ్యాధుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ పార్క్ (అన్నమయ్య సర్కిల్) వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ కె. లావణ్య, గుండె సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ కే. నాగేంద్ర ప్రసాద్ పాల్గొని నరాల సంబంధిత వ్యాధులు, గుండె సమస్యలు, వాటి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు ఆరోగ్యకరమైన జీవన విధానం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కేత సుధాకర్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.