ప్రభుత్వ పాఠశాలలతోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జడు. పి. హెచ్. ఎస్. అల్లిపూర్ ప్రధానోపాధ్యాయులు కిరణ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, యు.పి.ఎస్. యు.పి.ఎస్. ఉప్పుమాడుగు, అల్లిపూర్ గడికోట పాఠశాలలను, అల్లిపూర్ గ్రామ మహిళా సంఘ సభ్యులను కలిసి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మహిళా సంఘం ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన బోధన అందుతుందని వివరించారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వంటి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన సాగుతోందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పిల్లలందరినీ బడికి పంపే బాధ్యతను తల్లులు తీసుకోవాలని, గ్రామాల్లో 100% నమోదు సాధించాలని మహిళా సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, మహిళా సంఘం నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.