బోయపాలెంలో భక్తి ఉత్సాహం – సేవా సమితి సభ్యులకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 యడ్లపాడు మండల ప్రతినిధి.. బోయపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ సీతారామాలయ దేవస్థానమునందు ఈరోజు అనగా 11-04-2026 శనివారం రోజున 16 రోజుల పండుగ కార్యక్రమాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక అలంకరణతో కూడిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తదుపరి శ్రీరామనవమి నాడు నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో శ్రీ పార్వతీదేవి సేవ సమితి సభ్యులు భక్తులకు అన్నదాన ప్రసాదాలను పంపిణీ చేసినందుకు గాను, ఆలయం తరఫున వంశపారంపర్య ధర్మకర్త వడ్డేపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులకు శాలువాలు కప్పి గౌరవించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బద్దుల చినవీరయ్య, వి. నరసింహారావు, వి. శ్రీధర్, వి. గోపాలకృష్ణ, గోగినేని శ్రీనివాసరావు, అక్కయ్య, షేక్ రసూల్ తదితరులు పాల్గొనగా, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, సేవా భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించిందని పలువురు అభిప్రాయపడ్డారు