మహాత్మా జ్యోతి భాపూలే 200 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు గోడిశల రమేష్ గౌడ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ పట్టణంలోని జ్యోతి బాపూలే గ్రౌండ్ లో 200 జయంతి కార్యక్రమం ఘనంగా నివాళులు అర్పించిన జ్యోతి భాపూలే బిసి సంక్షేమ సంఘము రాష్ట్ర యూత్ అధ్యక్షులు గోడిశల రమేశ్ గౌడ్, ఈ సందర్బంగా మాట్లాడుతు జ్యోతి భాపూలే గ్రౌండ్స్ లో మహాత్మా జ్యోతి భాపూలే, మరియు సావిత్రి బాయ్ పూలె కాంశ్య విగ్రహాలను ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో సర్కస్ గ్రౌండ్ ను జ్యోతి భాపూలే గ్రౌండ్ గా మున్సిపల్ కమిషనర్ కి మా రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణ రావు ద్వారా కమిషనర్ తో జి.ఓ ను విడుదల చేయించామని, దానికి సహాయ సహకారాలు మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు, బోయిని పల్లి వినోద్ కుమార్ జి ఒ కోసం కృషి చేశారు, కానీ కస్య విగ్రహాలు ఏర్పాటు చేయలేకపోయారు కావున మీరు ఈ గ్రౌడ్లో మళ్ళీ జయంతి లోపు ఈ కస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ ని కోరమణి అన్నారు. ఈ కార్యక్రమం లో జ్యోతి భాపూలే బిసి సంక్షేమ సంఘము, అఖిల భారత గౌడ సంఘము రాష్ట్ర యూత్ అధ్యక్షులు, ఉద్యమ కారుల ఫోరం కరీంనగర్ నగర అధ్యక్షులు గోడిశల రమేశ్ గౌడ్,ఉమ్మడి కరీంనగర్ ఉద్యమ కారుల ఫోరం అధ్యక్షులు ఆనంద్, ఉత్తర తెలంగాణ మహిళా అధ్యక్షురాలు ఐల ప్రసన్న,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి ఐలయ్య, జిల్లా అధ్యక్షులు వంగ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు,