మహాత్మా జ్యోతి రావ్ పూలే 199వ జయంతి సందర్భంగా… ఘన నివాళి అర్పించిన బిఎస్పీమొదటితరం సామాజిక విప్లవకారుడు, బహుజన కులాల ఆరాధ్యుడు మహాత్మ జ్యోతిరావు పూలే199 వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఘన నివాళి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 12.04.2026 మదనపల్లె అన్నమయ్యజిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈరోజు చిత్తూరు జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ బహుజన కులాల బ్రతుకుల్లో చైతన్యం నింపిన సామాజిక విప్లవకారుడు "మహాత్మా పూలే" అనిఅన్నారు. అందరికీ విద్య, సమాన హక్కుల కోసం మనువాదులతో ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. అంబేద్కర్ కూడా పూలే నిగురువుగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు ఆ మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కాన్సిరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించారని తెలిపారు ఆ మహనీయుల ఆశయం కోసమే బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు, బహుజన వర్గాలన్నీ రాజకీయంగా చైతన్యం పొందాలని అప్పుడే సమ సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి, సురేంద్రబాబు, జిల్లా ఇంచార్జ్ పి, లోకనాథం, జిల్లా అడ్వైజర్ & పూతలపట్టు అసెంబ్లీ ఇన్చార్జ్ కాణిపాకం నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి మద్దెల బాబు, చిత్తూరు అసెంబ్లీ అధ్యక్షులు గురునాధం, కన్వీనర్ ధనరాజ్, మాజీ రాష్ట్ర కార్యదర్శి సంగీతం సిద్దయ్య మూర్తి,మాజీ జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పి,భాస్కర్,ఐరాల మండల ఇన్చార్జ్ కలికిరి వానాద్రి, ఉపాధ్యక్షులు గోవర్ధన్, జీడి నెల్లూరు ఇంచార్జ్ చిరంజీవి, వెదురుకుప్పం మండల అధ్యక్షుడు ఉంగరాల నాగేశ్వరరావు,, ఐరాల మండలం బి.వి.ఎఫ్ కన్వీనర్ జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.