​ముత్తమ్మ మృతికి మండల నాయకుల నివాళి

పయనించే సూర్యడు ఏప్రిల్ 12 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు కరివిరాల మాజీ సర్పంచ్, దివంగత మారుతి గురువులు ధర్మపత్ని, మాజీ జెడ్పిటిసి ఉపేందర్ రావు మాతృమూర్తి ముత్తమ్మ శనివారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మండల నాయకులు దేవబత్తిని సురేష్ ప్రసాద్, వెంకట నరసయ్య, గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, అనంతుల ఆంజనేయులు, పాతకోట్ల నాగేశ్వరరావు, రానబోతు రామిరెడ్డి ,పోలంపల్లి వెంకటేశ్వర్లు తదితరులు ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ​అనంతరం ఉపేందర్ రావును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మారుతి కుటుంబానికి ముత్తమ్మ మరణం తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.