రాయపోల్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ

"పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 రాజేష్ దౌల్తాబాద్) బలహీన వర్గాల దీనజన బాంధవుడు సమ సమాజ నిర్మాణ కృషివలుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్ర నర్సింలు, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, ఉషనగల్ల స్వామి అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య అభివృద్ధికి, సమాన హక్కుల సాధనకు ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. కుల వివక్ష నిర్మూలన కోసం, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ఎప్పటికీ హర్షించదగ్గ విషయం అని తెలిపారు.అలాగే పూలే ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ విద్యను అభివృద్ధి సాధనగా భావించాలని, సమాజంలో వెనుకబడిన వర్గాల పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమం ముగింపులో పూలే ఆశయాలను పాటించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు తుడం నర్సింగరావు, యూసుఫ్, మల్లేశం, నవీన్,బాలకృష్ణ, పుట్ట నవీన్, శ్రీకాంత్, శ్రీనివాస్, భరత్, నందు,తుడుం స్వామీ, శ్రీహరి, శ్రీకాంత్, రాజు, ప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.