వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థుల వీడ్కోలు వేడుకలు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్స్ విద్యార్థులకు శనివారం రోజున హుజురాబాద్ సాయిరూప ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు వారి కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించుకొని మంచి ఉద్యోగo సంపాదించుకొని వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలనీ చెప్పడం జరిగింది.అలాగే కళాశాల ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి ఫీ రెంబుర్స్మెంట్ రాకున్నా విద్యార్థులనుండి ఎటువంటి ఫీజు తీసుకోకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యానందిస్తున్న ఎక్కకా కళాశాల శ్రీ వాగ్దేవి కళాశాల కావున విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తిరులై జీవితం లో మంచి స్థాయి లో స్థిరపడాలన్నారు, తరువాత కళాశాల లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది. అనంతరం విద్యార్థుల నృత్యాలతో ఘనగా తృతీయ సంవత్సరాం విద్యార్థులకు వీడుకోలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో విద్యార్థిని విద్యార్థులతో పాటు అధ్యాపకులు కొలిపాక రమేష్, రామరాపు భద్రయ్య, వేముల శ్రీనివాస్, చందా వెంకటేష్, సురేష్, మేకల నవీన్ కుమార్, శ్రీనివాస్, స్వప్న, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.