“సప్తస్ఫూర్తి: పాలెం వ్యవసాయ కళాశాల దినోత్సవం ఘనంగా”

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 12, నాగర్ కర్నూల్ జిల్లా, బిజినపల్లి (రిపోర్టర్: కే. శ్రావణ్ కుమార్) పాలెం: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాల, పాలెంలో శుక్రవారం ఏడవ కళాశాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కె.ఏ.వి.ఎస్. ప్రసాద్ (ఎస్‌బీఐఆర్‌డీ, హైదరాబాద్) పాల్గొనగా, అతిథిగా డా. చే. వేణు గోపాల్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం అతిథుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, వందేమాతరం, విశ్వవిద్యాలయ గీతం, ఉపన్యాసాలు నిర్వహించారు. అనంతరం కళాశాల వార్షిక పత్రికను విడుదల చేయడంతో పాటు డా. ఈటెల సత్యనారాయణ, బి. పరమేశ్ రచించిన గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనుబంధ శాఖాధిపతి డా. కె. సుహాసిని కళాశాల అభివృద్ధిని వివరిస్తూ, విద్యార్థులు చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. డా. ఈటెల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ముఖ్య అతిథి ప్రసాద్ లక్ష్య సాధనకు పట్టుదల అవసరమని సూచించగా, గౌరవ అతిథి వేణు గోపాల్ రెడ్డి విద్యతో పాటు నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించారు. జాతీయ సమీకరణ శిబిరం (ఎన్‌ఐసీ) మైసూరు శిబిరంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. అంతర్గత పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఐక్య కృషి అభివృద్ధి సంస్థ (ఐకేఏకే ఫౌండేషన్) డైరెక్టర్ కిషోర్ వొడపల్లి తుదివ సంవత్సరం విద్యార్థులకు దిశా ప్రమాణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.