అంగరంగ వైభవంగా శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ట మహోత్సవం..5వేల మందికి అన్న సంతర్పణ..

పయనించే సూర్యుడు ప్రిల్ 13, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సర్పవరంలో నూతనంగా వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ దివ్య ప్రతిష్ట మహోత్సవాన్ని తోట చక్ర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గణపతి హోమం, చండీ హోమం , మహా పూర్ణాహుతి కార్యక్రమంలో తోట చక్రారావు సూర్య కుమారి దంపతులు, పుల్ల స్వాములు వెంకటలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆశీస్సులతోఎన్నో ఏళ్ల బట్టి అనుకుంటున్నా శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి నూతన నిర్మించేందుకు ఏర్పాటుచేసి సహకరించిన సుమారు పది లక్షల రూపాయలు హెచ్చించి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాక మూడు రోజులపాటు పూజా కార్యక్రమాలు ఈరోజు మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమం కొండబాబు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుల్ల శ్రీరాములు, పుల్ల వీరబాబు, పుల్ల ప్రభాకర్ రావు, పుల్ల చందు, ధర్మరాజు, మాజీ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు ఆలయ కమిటీసభ్యులు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.