కొత్త బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలంలోని చుక్కపూర్ గ్రామంకు బస్సు సౌకర్యంను ఎమ్మెల్యే శనివారం. ప్రారంభించారు. పలాస నియోజకవర్గం మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి శాసన సభ్యులు బస్సు సర్వీసును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో, విద్యార్థులు, రైతులు, మరియు అత్యవసర పనులపై మండల కేంద్రానికి వెళ్ళే ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఇటీవలే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యపై తక్షణమే స్పందించిన ఆమె, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి, అతి తక్కువ సమయంలో గ్రామానికి కొత్త బస్సును మంజూరు చేయించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని, ఈ రోజు ఈ గ్రామానికి బస్సును తీసుకురావడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రతి గ్రామానికి ప్రభుత్వ ఫలాలను అందించడమే మా కర్తవ్యం. ఇకపై ఈ గ్రామ ప్రజలు రవాణా కష్టాలు లేకుండా తమ పనులను సులభంగా చేసుకోగలుగుతారని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ఎమ్మెల్యే కు, కూటమి ప్రభుత్వానికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ముఖ్య నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.