డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్ )ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే

చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీసీ హాస్టల్ వార్డెన్ హనుమ రెడ్డి బిసిహాస్టల్ వార్డెన్ రాజశేఖర్ యమునా సుప్రియ వారు మాట్లాడుతూ…* జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను స్మరించుకొని అలాగే కుల నిర్మూలన బాల్య వివాహాలు పేద బడుగు బలహీన వర్గాలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని అలాగే వాళ్ళ చేసినటువంటి కృషిని ఎల్లవేళలా స్మరించుకోవాలని పేద విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండాలని వాళ్లు చేసినటువంటి కృషినే ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాము. దీనికి కారణం జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే కారణం, కావున ఇప్పుడున్న విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని వాళ్లు నడిచినటువంటి అడుగుజాడల్లో నడవాలని జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలని వారు మాట్లాడడం జరిగింది..