పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్/13:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం బోటి మీది పల్లె గ్రామంలో నూతనంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ గౌరవేని శ్రీవాణి సుమన్,అలాగే ఉపసర్పంచ్ గౌరవేణి లతికా నరేష్, పాలకవర్గం మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కృషితోనే ఈ బస్సు సౌకర్యం సాధ్యమైందని సర్పంచ్ మాట్లాడుతూ తెలిపారు. అలాగే గ్రామస్తులు ఎన్నడూ లేని విధంగా మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు గ్రామ సర్పంచ్, ధన్యవాదాలు తెలిపారు.