రెంజల్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రారంభించిన నాయకులు రైతులు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 రెంజల్ : రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రెంజల్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ అన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని బోర్గం గ్రామంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. గ్రామ సర్పంచ్ ధనుంజయ ఐకెపి ఎపిఎం భాస్కర్ మాజీ సర్పంచ్ జావిద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగా కృష్ణ సాయి రెడ్డి యూత్ అధ్యక్షులు కార్తీక్ యాదవ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎల్ రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు