పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక మరియు బీసీ సంఘాల నాయకత్వంలో భారత దేశపు అగ్ర శ్రేణి సంఘ సంస్కర్తలో ఒకరు తరతరాలకు మార్గ దర్శిగా నిలిచిన క్రాంతి పదగామి మహాత్మా జ్యోతిబా పూలే 199 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికన్న ముందు జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పలువురు ఉద్యమ కారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యను గ్యాన సమోపార్జన ను జీవిత లక్ష్యాలు గా మలుచుకున్న మహాత్మా జ్యోతిబా పూలే జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదని ఆ శక్తి అందరికి అందాలని స్వస్థంగా గుర్తించారు ఆయన సమాజంలో అనేకులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షగా ఉన్న ఆ కాలం లోనే బాలికల కోసం విద్య అవకాశాలు లేని వర్గాల కోసం పాఠశాలు తెరివి విద్యా విప్లవానికి నాంది పలికిన జ్యోతిబా ఫూలే అని ప్రశంసించారు మహాత్మా జ్యోతిబా ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అంతేకాదు నైతిక స్థైర్యం నిరంతర సత్యాన్వేషణ సామాజిక శ్రేయస్సు పట్ల అచంచలమైన అంకిత భావం కలబోసిన ఉదాత్త జీవితం ఆయనది ఎన్నో సంస్థలను నెలకొల్పి ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించి చిరస్మరణీయులయ్యారు ఫూలే అని కొనియాడారు సామాజిక సమానత్వం కోసం తుది శ్వాస వరకు కృషి చేసిన గొప్ప యోధుడు జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. మహాత్మా ఫూలే ఆశయ సాధన కోసం సమాజం లోని అందరూ కృషి చేయాలని పేర్కొనారు ఈ సందర్భంగా అందరికీ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు ఆర్ రాజన్న , ప్రధాన కార్యదర్శి పి నర్సయ్య , ఉపాధ్యక్షుడు ఏ గంగన్న , సింగరేణి విశ్రాంత సంఘ నాయకులు , తెలంగాణ ఉద్యమ కారులు, బీసీ సంఘాల నాయకులు మదరబోయిన మల్లేష్ , మోతుకూరి రాంబాబు , ఇందూరి రామన్న , దోరిశెట్టి పోశయ్య , పోతురాజుల చంద్రయ్య , రసకట్ల రాజయ్య ,ఎల్ రమేష్ లాల్ , పులి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే కు జోహార్ అమర్ హై మహాత్మ జ్యోతిబా ఫూలే అమర్ హై అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.