హున్సా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ నాయకులు రైతులు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 బోధన్ : రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్ అన్నారు. సాలూర మండల కేంద్రంలోని హున్సా గ్రామంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ హనుమంతరావు సర్పంచులు శివకుమార్ నాగయ్య రావుబా సావిత్రి గంగాధర్ ఉప సర్పంచ్ నాగేష్ నాయకులు మందర్న రవి ఇళ్తేపు శంకర్ ఖాజాపూర్ అనిల్ గ్రామస్తులు వినోద్ రావు మురిగే శంకర్ నరేందర్ గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు