పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 దండేపల్లి దండేపల్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకోవాలని దండేపల్లి మండలం జై భీమ్ సైనిక్ దళ్ అధ్యక్షులు పర్ష మోహన్ దాస్ పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను మనం ఆచరణలో పెడితే అభివృద్ధిలో దేశం పురోగమిస్తుంది అంటూ, దేశంలో సమానత్వం ప్రతి పౌరునికి స్వేచ్ఛ బావప్రకటన జవాబుదారితనం ప్రశ్నించే హక్కు భిన్నత్వంలో ఏకత్వం మనకు రాజ్యాంగం కల్పించిందని అది కేవలం భారత రాజ్యాంగం తోటే సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు నేడు దండేపల్లి మండలం జరిగే ఉత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉద్యోగ సంఘాల నాయకులు అధికార ప్రతినిధులు రాజకీయ నాయకులు పుర ప్రముఖులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు,,