పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.14.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం ఆర్కే రిసార్ట్స్ లో సోమవారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపియూడబ్ల్యుజె)పోలవరం జిల్లా సమావేశంలో జిల్లా జర్నలిస్టుల ప్రత్యేక ఆహ్వానం మేరకు.విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు,భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.తొలిత ఆయనకు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు.పూలమాలలతో సత్కరించి మెమొంటో అందజేశారు.ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ…జర్నలిస్టుల సంక్షేమ,అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.వారికి ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు,బీజేపీ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,జర్నలిస్టుల యూనియన్ సభ్యులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.