ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాండ్రంకి రాజు పుట్టినరోజు వేడుకలు..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే ఆత్మబంధువు పాండ్రంకి రాజు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే పంతం నానాజీ నేతృత్వంలో ఆయన నివాసంలో కార్యకర్తలు కూటమి నాయకులు ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా ఆప్తుడు జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడి వ్యక్తి పాండ్రంకి రాజు అని ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నామన్నారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో తులతూగాలని పార్టీలో మరింత ఎత్తుకు ఎదగాలని పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జనసైనికులు రాజు అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.