ఎల్ ఆర్ పల్లి అంగన్వాడి కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) స్థానిక ఎల్ ఆర్ పల్లి 1 సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు సిడిపిఓ పి సునీలత . సూపర్వైజర్ ఆదేశాల మేరకు సోమవారం ముందస్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంగన్వాడి కార్యకర్త షేక్. షకీలా ఆధ్వర్యంలో ఎల్ ఆర్ పల్లి వన్ అంగన్వాడి కేంద్రంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి చిన్నారులతో, ఆశ వర్కర్ , ఆయా లతో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘసంస్కర్త, ఆర్థిక వేత్త, న్యాయ వాది అని,ఆయన మరణాంతరం 1990 లో భారత రత్న బిరుదు లభించిందని కార్యకర్త చిన్నారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సిబ్బంది విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు