కృష్ణామాచారి గారి మృతదేహానికి నివాళులు అర్పించిన శ్రీలత పసుపులేటి

పయనించే సూర్యుడు… సామల రామకృష్ణ.. నేలకొండపల్లి 14…2026 నేలకొండపల్లి లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం పూర్వ పూజారి ముడుంబా కృష్ణమాచార్యులు గారు ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శ్రీలత పసుపులేటి వారి నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ మూడవ వార్డు మెంబర్ తోట వాసు,పద్నాలుగవ బార్డు మెంబర్ కోడిరెక్క వినోద్,వేణుగోపాల స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కూరాకుల నాగేశ్వరరావు,కాంగ్రెస్ నాయకులు మన్నే నరేశ్ పాల్గొన్నారు