పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్: మండల పరిధిలోని కొత్తూరు (బి) గ్రామంలో మౌలిక వసతుల కల్పన దిశగా కీలక అడుగు పడింది. ఉపాధి హామీ పథకం మరియు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిమెంటు రహదారి మరియు మురుగు కాలువ నిర్మాణ పనులను గౌరవ జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వపు సంత ప్రాంగణ అధ్యక్షుడు గుండప్ప, మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, గ్రామ సర్పంచ్ మహాదేవి మల్లికార్జున్, మండల మహిళా అధ్యక్షురాలు సరస్వతి రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు మచ్చేందర్, మోహన్ రాథోడ్, రాథోడ్ భీమ్ రావు నాయక్, పూర్వపు సర్పంచ్‌లు చిన్న రెడ్డి, జగదీష్ హాజరయ్యారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, నాయకులు బాబు, శ్రీకాంత్, నర్సిములు, ఉపసర్పంచ్ మోసిన్, శివకుమార్, నబియొద్దీన్, ప్రళత్ రెడ్డి, సమయ్య, పాపనాథ్, పాపయ్య, బొప్ప బాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇమ్రాన్, కలెబ్, సంగమేశ్వర్, అలిగి రాజు, సమధ్, తౌఫీక్, సిరాజ్ ఉద్దీన్ మరియు ఇతర గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.