జగన్నాధపురంలో ‘అరైవ్-అలైవ్’ రోడ్డుభద్రత అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డుభద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ వీరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ పరిమితులు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్లూరి స్వప్న, ఉప సర్పంచ్ అలవాల శ్రీదేవి, వార్డు సభ్యులు తోటకూరి హరీష్, కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి రమేష్, తన్నీరు పుల్లారావు, ముల్లంగి కోటయ్య, గుడిపూడి నరసింహారావు, అలవాల నాగేశ్వరరావు, యర్రమల ప్రసాద్, ఎస్.కే సైదా, అంగన్వాడీ టీచర్ కాసిమాల వెంకమ్మ, ఆశ వర్కర్ బందెల అరుణ, ఎరుకల వెంకటేష్, కాశీమాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.