పయనించే సూర్యుడు న్యూస్: కడప : ఏప్రియల్ 14 జాతీయ ప్రవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ న్యూఢిల్లీ మరియు ఎడు మిర్రర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో 50 ఉత్తమ విద్యా సంస్థల ఎంపిక నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ పురస్కారంకు స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కడప సిటీ విభాగం ఎంపిక అ యింది.జాతీయస్థాయిలో ఈ ప్రతిష్టాత్మక ఉత్తమ పాఠశాల అవార్డును విద్యాసంస్థల డైరెక్టర్ ఎం వివేకానంద రెడ్డి బెంగళూరులోని రమదా హోటల్లో ఎంతో వైభవంగా నిర్వహింపబడ్డ కార్యక్రమంలో స్వీకరించారు. ఈ అవార్డు పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి అధ్యాపకులకు, విద్యార్థులకు, మరియు తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని,ఈ అవార్డును స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. దేశ నలుమూలల నుండి వచ్చిన అతిథుల ముందు వైయస్సార్ కడప జిల్లాకు అవార్డు రావడం వలన ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ముందు ముందు విద్యార్థులలో సరైన సంస్కారంను,పట్టుదల, క్రమశిక్షణ వచ్చేలా కార్యచరణ ఉంటుంది అని అన్నారు ఎం. వివేకానంద రెడ్డి ని పాఠశాలలోని ప్రిన్సిపల్ హరికృష్ణ ,ఇంచార్జ్ సంధ్యా రెడ్డి , ఏ.వో చంద్ర , స్కూల్ పి.ఈ.టి జయచంద్ర మరియు అధ్యాపకులు ఎంతో ఘనంగా పూలమాలలతో,శాలువాలతో సత్కరించారు.