తగ్గెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 సాలూర : సాలూర మండలం తగ్గెల్లి గ్రామంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ,జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డీఆర్డీఏ సౌజన్యంతో సోమవారం మండలం అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి లాభాలు గడించాలని బోధన్ ఏఎంసీ చైర్మన్ శీల శంకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి మండల ఎమ్మార్వో నవాజ్ ఆర్ఐ ఆనంద్ ఏవో శ్వేత గ్రామ సర్పంచ్ బేగరి అరుణ భూమయ్య ఉప సర్పంచ్ దేవేందర్ ఏపీఓ సాయిలు వివోఏ స్వప్న సీసీ విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి గంగా మల్లయ్య గ్రామ విడిసి అధ్యక్షులు కరిడే రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి,మందర్న రవి,ఇల్తెపు శంకర్,అల్లె రమేష్,సొక్కం రవి లక్ష్మణ్ పటేల్ గ్రామ రైతులు నిఖిల్ అంబదాస్ రాజేష్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.