తెలుగుదేశం పార్టీ హజ్ యాత్ర వెళ్తున్న హాజీలకు విందు మరియు సన్మాన కార్యక్రమం.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని పట్టణంలోని ఎస్ కె వి ఫంక్షన్ హాల్‌లో, తెలుగుదేశం పార్టీ నాయకులు డి. ఆరిఫ్ బాషా ఆహ్వానం మేరకు, హజ్ యాత్రకు వెళ్తున్న హాజీలకు విందు మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కొంకా ఉమాపతి నాయుడు పాల్గొని, హజ్ యాత్రికులు క్షేమంగా యాత్ర పూర్తిచేసి తిరిగి రావాలని, రాష్ట్ర ప్రజల మరియు ఆదోని పట్టణ అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాల కోసం దువా చేయాలని కోరారు. అదేవిధంగా యాత్రికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, జాఫర్ సాధిక్, అసిఫ్ బాషా, మన్సూర్ మరియు ఇతర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.