దాహార్తి తీర్చేందుకే చలివేంద్రం : విద్యుత్తు డి.ఈ రాజశేఖర్

పయనించే సూర్యుడు-14-04-2026-రాజంపేట న్యూస్ : బాటసారుల దాహార్తికిచ్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎన్.రాజశేఖర్ తెలియజేశారు. కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద మజ్జిగ మరియు మంచినీటి చదివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్.రాజశేఖర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని బాటసారుల దాహార్తి తీర్చేందుకు చల్లని మంచినీటితోపాటు మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కే.వి.యు.ఎస్.ఎస్.ఎస్ సంఘ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఏ.డి.ఈ పి.సుబ్రహ్మణ్యం, కోడూరు ఏడీఈ ప్రియదర్శన్ రెడ్డి, రాజంపేట ఈఆర్ఓ శిరీష, అసిస్టెంట్ ఇంజనీర్లు ఈశ్వర్ రాజు, యోగానందం, సుబ్రహ్మణ్యం, జూనియర్ అకౌంటెంట్ అధికారులు రమేష్, విజయ్ చంద్ర, రాజా, సుధాకర్ నాయుడు, కె వి యూ ఎస్ ఎస్ ఎస్ సంఘ ప్రతినిధులు పత్తిపాటి కుమార్, ఈ.శ్రీహరి, ఎస్.వెంకటసుబ్బయ్య తో పాటు అన్ని యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.