ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

దళారులను నమ్మి మోసపోవద్దు. కొడవటూరు సర్పంచ్ నీల కవిత మురళి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నీల కవిత మురళితో కలసి ప్రారంభించి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు సెంటర్లలో అమ్ముకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడదెబ్బ తగలకుండా చలువ పందిళ్ళు, చలివేంద్రాలు నీటి వసతిని కల్పించి రైతులకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ దళారుల నమ్మి మోసపోవద్దని నాణ్యమైన ధాన్యానికి గిట్టుబాటు ధర 2389/-, కామన్ వడ్లకి 2369/- ప్రభుత్వం ద్వారా చెల్లిస్తారని దీన్ని రైతులు సద్వినియోపరుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఇర్రి రమణారెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, నీల మురళి, సెక్రటరీ రూప, ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు రైతులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.