ప్రజా వారధిగా పాత్రికేయ వ్యవస్థ.

★ మెరుగైన సమాజం కోసం పాటుపడాలి. ★ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు హమీ ఇచ్చిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. ★ ఘనంగా ఏపియూడబ్ల్యుజె పోలవరం జిల్లా సమావేశం.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.14.2026 రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.మెరుగైన సమాజం కోసం అహర్నిశలు పరితపించే వ్యవస్థే పత్రికా వ్యవస్థ అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.రంప చోడవరం ఆర్కా రిసార్ట్ లో సోమవారం మాసినేని చంద్ర శేఖర్ పోలవరం జిల్లా కన్వీనర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమెకు యూనియన్ సభ్యులు స్వాగతం పలికారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…పాత్రికేయులకు సమాజంలో కలిగే అభ్యంతరాలపై వివరించారు.అలాగే వారు సమాజం కోసం వారి బాధ్యతగా చేసే పలు విధానాలపై క్షుణ్ణంగా వివరించారు.నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వాదులుగా ఉండటాన్ని ప్రశంసించారు. అలాగే ప్రభుత్వ కార్య నిర్వహణలో జరిగే అలసత్వం పై పర్యవేక్షణ పరిష్కారం కోసం పడే జిజ్ఞాస అమోఘమన్నారు.ఈ సందర్భంగా ఆమెకు పాత్రికేయ యూనియన్ వారు పలు సమస్యలపై విన్నవించగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అహర్నిశలు సమాజ శ్రేయస్సు కోసం పరితపించే పాత్రికేయులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి సమాజంలో ఎంత కీలకమో అనే విధానంపై వివరించారు. ముఖ్యంగా పాత్రికేయులు ఐక్యంగా ఉండాలని సూచించారు.ఈ యూనియన్ ఇలాంటి సమావేశాలు నిర్వహించటం శుభదాయకమన్నారు.కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జి రెడ్డి,ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత,తూర్పు గోదావరి జిల్లా విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు,తెదేపా మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, ఏపియూడబ్ల్యూజె యూనియన్ ప్రతినిధులు ఐవి సుబ్బారావు, కె.స్వాతిప్రసాద్, ఎమ్.శ్రీరామ్మూర్తి ఏచూరి శివ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.అంబేద్కర్, సీతపల్లి గడి బాపనమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కుంజం బాపన్న దొర, సభ్యులు సిద్ధా వెంకన్న దొర, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు షేక్ చోటు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోసు నాగన్న దొర, పతివాడ రమణ, సాదాల సత్య, పెంటమ్మ, బొడ్డేటి వీరబాబు,కారు లక్ష్మి, గూడెం బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.