మొక్కజొన్న రైతుల ఆవేదన: అదనపు కొనుగోలు కేంద్రాలు కోరుతూ కలెక్టర్‌కు వినతి

వినతి పత్రం అందజేస్తున్న రైతుల పక్షాన డి రాము

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినేపల్లి మండలంలోని పాలెం, వడ్డేమాను, మంగనూరు, వట్టెం గ్రామాల రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలంలో 34 గ్రామాలు, తండాలు ఉండగా ప్రస్తుతం ఒక్క కేంద్రం మాత్రమే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పంట రవాణాకు రూ.2–3 వేల వరకు ఖర్చవుతుండగా, హమాలీ ఛార్జీలు కూడా భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేంద్రంలో త్రాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు లేక రైతులు ఎండలో వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. పాలెం, వడ్డేమాను, మంగనూరు, వట్టెం ప్రాంతాల్లో అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో డి వెంకటయ్య డి రాము జయప్రకాష్ తదితల రైతులు ఉన్నారు