పయనించే సూర్యుడు : ఏప్రిల్ 14 జడ్చర్ల తాలూకా బాలానగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ నేడు మోతిగణపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా వంగూరి శ్రీనివాస్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా యాదయ్య శ్రీకాంత్ ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ నరసింహులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ కార్యదర్శులుగా రవి విష్ణు సంయుక్త కార్యదర్శి యాదయ్య సలహాదారులుగా నర్సింలు మేస్త్రీ కృష్ణయ్య రామచంద్రయ్య వెంకటేష్ యాదయ్య సోషల్ మీడియా వారియర్స్ గా శివకుమార్ వెంకటేష్ సిద్ధార్థ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వంగూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుకోండి, పోరాడండి, సంఘటితం అవ్వండి" అనేది అంబేద్కర్ ఇచ్చిన అత్యంత శక్తివంతమైన పిలుపు అని,మహిళల ప్రగతి, సమానత్వం, మరియు విద్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఎంతో విలువైనవి కొనియాడారు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగంలో కేవలం పదాలు కాదు. అవి రాజ్యాంగం ప్రాణం అని వివరించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పడిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు