రోడ్ భద్రతపై అవగాహాన కలిగి ఉండాలి : సిఐ అది రెడ్డి

★ గ్రామంలో రోడ్ల సమస్యలు పరిష్కరించడం , గుంతలు పూడ్చడం. ★ రోడ్డు ప్రక్కన ఉన్న బావులుపూడ్చడం , రోడ్ల పక్కనున్న పొదలు తొలగించడం. ★ రోడ్డు భద్రతపై అవగాహన కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం. ★ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ★ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు లో చండూరు సి.ఐ ఆది రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 14 : చండూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ప్రజలలో హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాధాన్యత, ట్రాఫిక్ నిబంధనల (వేగ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ)పై అవగాహన కల్పించడం ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశ్యం. పోలీస్ శాఖ, ఇతర సంస్థల సమన్వయంతో, "అరైవ్ అలైవ్ కార్యక్రమాల ద్వారా సురక్షితమైన ప్రయాణం, ప్రాణ రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు . నల్లగొండ జిల్లా రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా సోమవారం చండూరు పట్టణంలో మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను చండూరు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేశారు . చండూరు మండలం పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాదం కు గల కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో రోడ్డు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చండూరు మండలం పరిధిలో అన్ని గ్రామాలలో పోలీస్ గ్రామ పోలీస్ అధికారులునిర్వహించినారు . *రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి సీఐ ఆది రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్‌లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్‌ లైసెన్స లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, మొబైల్‌ ఫోన వినియోగిస్తూ డ్రైవింగ్‌ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులతోపాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని సీఐ సూచించారు. ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని నంద్యాల ట్రాఫిక్‌ సిఐ ఆదిరెడ్డి సూచించారు.  రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, కార్లలో సీట్‌బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని అన్నారు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి. యువకులు , విద్యార్థులు డ్రైవింగ్‌ చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. వేగానికి సంబంధించిన ప్రమాదాల ప్రభావాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాన్నారు. సీట్‌ బెల్టు, హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం ఉండదన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడం వల్ల వాహనాలు నడిపే వారు, రోడ్డుపై వెళ్లే వారు క్షేమంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చండూరు సిఐ అది రేడ్డి , ఎస్ఐ శివ కుమార్ , ఎమ్మార్వో రమాకాంత్ శర్మ , మున్సిపల్ చైర్మన్కోడి శ్రీనివాసులు , వైస్ చైర్మన్ భూతరాజు దశరథ , కౌన్సిలర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు .