లుంబిని విద్యాలయం లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) లుంబిని విద్యాలయం నందు యు కె జి నుండి 1 క్లాస్ మరియు 5 నుండి 6 క్లాస్ కి ప్రమోట్ చేయబడిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించామని మరియు 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ రకాల పోటీపరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్ బి.రాము సార్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.బహుమతుల ప్రధానం అనంతరం విద్యార్ధిని విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి మంచి విద్యాబుద్ధులు అలవర్చుకావాలని ఈ. సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఎల్ కె జి నుండి 9 వ తరగతి వరకు 2025-26 సంవత్సరంలో జరిగిన పరీక్షా ఫలితాలు ఆధారంగా బహుమతులు ప్రాధానోత్సవం కార్యక్రమం నిర్వహించుట జరిగింది.తదుపరి విద్యార్ధిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుట జరిగింది. ఈ కార్యక్రమములో అధ్యాపకులు. విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు