పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో పిఎసిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బెజాడి సిద్ధులు ఉప సర్పంచ్ నాగరాజు వార్డు మెంబర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు దళారుల చెప్పే మాయ మాటలకు మోసపోద్దని అన్నారు. రైతులు పండించిన వడ్ల ధాన్యానికి ఏ గ్రేడ్ ఒక క్వింటాకి ₹2389/- కామన్ వడ్ల ధాన్యానికి ₹2369/- రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులు వడ్లు మార్కెట్లో పనులు చేసుకునే సమయంలో ఎండలు విపరీతంగా కొట్టడం వల్ల నీరసం రాకుండా ప్రభుత్వం దాహం కోసం ఓ.ఆర్.ఎస్, చల్లటి నీరు, రైతులకు అందిస్తుందని చలవ పందిరిలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యుడు సానిక కనకరాజు, 4వ వార్డు సభ్యులు సానిక రాజు, 5వ వార్డు సభ్యురాలు బెజాడి విజయలక్ష్మి, 8వ వార్డ్ సభ్యులు మేకల రమేష్, భవాని గ్రామ పంచాయతీ కార్యదర్శి నూకల సౌజన్య రెడ్డి, పిఎసిఎస్ సీఈవో కాశ బాలస్వామి గ్రామ రైతులు పాల్గొన్నారు.