శ్రీరాముల విగ్రహాల ఊరేగింపు..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) విజయనగరం నెలమమర్ల గ్రామంలో వైసిపి పాలన లో ధ్వంసం చేసిన శ్రీ రాముల విగ్రహాల ఊరేగింపు కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ కార్యాలయం వద్ద రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్, కూటమి నాయకులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన లో ఆలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. నెలిమర్ల లో జరిగిన ఘటన లో ధ్వంసం అయ్యిన సీత సమేత శ్రీ రాములు, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలు ప్రతి గ్రామం మీదుగా కొట్టిపల్లి వద్ద గోదావరి లో నిమజ్జనం చేస్తారని, రూరల్ నియోజకవర్గం లో విగ్రహాల కు స్వాగతం పలికా మన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగ కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాల పరిరక్షణ కు పెద్ద పీట వేస్తుందన్నారు. ఈ సందర్భంగా మాదారపు తాతాజీ మాట్లాడారు. బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పెంకే శ్రీనివాస బాబా, కాకరపల్లి చలపతిరావు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.