స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఉమెన్ ఎంపవర్ కమిటీ వారి నిర్వహణలో “స్త్రీ శక్తి” అవగాహన సదస్సు”

పయనించే సూర్యుడు రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 14.4.2026 స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకము ఒకటి రెండు మూడు మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో "స్త్రీ శక్తి" అవగాహనా సదస్సు" 13.04.2026 రోజున కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము, ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు మరియు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 2023 చట్టసభలో మహిళా బిల్లును ఉద్దేశించి, మహిళలకు చట్టసభలలో 33%1/2 రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో, ఇటీవల 2029 ఎలక్షన్ సందర్భంగా అమలుపరచడాలని, ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో, ఈ విషయంలో మంచి అవగాహన కలిగి ముందుండాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చోడవరం ఏ ఎస్ ఐ, డి ఎస్ ఎం కుమారి ప్రతి విద్యార్థిని సమాజంలో జరుగుతున్న మంచి చెడ్డలను అవగాహన కలిగించుకొని, తనను తాను తీర్చిదిద్దుకున్నప్పుడే మహిళా సాధికారిక సాధ్యపడుతుందని విద్యార్థులకు సూచించారు. ఇతర చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ డిఎస్ఎన్ కుమారి ఇతర అధ్యాపక బృందం అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలతో సత్కరించారు. అనంతరం అంబేద్కర్ రచించిన పుస్తక రచనలపై వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం చేయడం జరిగినది. ఆంగ్ల అధ్యాపకులు హెచ్వో డి డాక్టర్ మల్లి బాబు