అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక మహాశక్తి మంత్రి ఆనం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరులో మంత్రి ఆనం ఆధ్వర్యంలో అట్టహాసంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఆత్మకూరు మున్సిపల్ బస్టాండు సమీపంలో ఎస్‌సి ఎస్‌టి సంఘాల నాయకులు, ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి వినమ్ర నివాళులర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మన దేశానికి దిక్సూచి అంబేద్కర్ రచించిన మహోన్నతమైన గ్రంధం భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితో నేను రాజకీయాల్లో ముందుకుసాగుతున్నా. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు. మన దేశంలో మహోన్నత ఆశయాల గల దైవాంశ సంభూతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవిష్యత్ తరాలకు కూడా అంబేద్కర్ స్ఫూర్తి తెలియజేయాలి. ఆయన అడుగుజాడల్లో మనమంతాదేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తోంది. అమరావతిలో 125 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆత్మకూరులో మున్సిపాలిటీలో అంబేద్కర్ పేరుతో పార్కును అభివృద్ధి చేస్తాం ఆత్మకూరు మున్సిపల్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి మండపాన్ని నిర్మిస్తాం ఆత్మకూరులో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థలాన్ని సేకరించి భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం అంబేద్కర్ ఆశయాల సాధనలో అందరూ కలిసి పనిచేయాలి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు