అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం

అంబేద్కర్ సాక్షిగా రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 15, అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని టీడీపీ సెంటర్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రహదారి ప్రమాదాల నివారణ మరియు ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా ఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఎంపీడీవో శ్రీ ముత్యాల రావు, సి.ఐ అశోక్ రెడ్డి,ఎం.ఆర్.ఓ సూర్య ప్రకాష్ మరియు ఎం.పీ.డీ.వో ఆఫీస్ యుడిసి పద్మావతి , వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు ప్రజలందరితో రహదారి నిబంధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరియు అతివేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై సి.ఐ అశోక్ రెడ్డి మరియు ఎంపీడీవో సూచనలు ఇచ్చినారు.