అసమానతలపై అక్షర యుద్ధం చేసిన యోధుడు బి .ఆర్ అంబేద్కర్ : మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

★ భారతదేశం గర్వించదగ్గ సమసమానత్వ స్వాప్నికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ★ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి శుభాకాంక్షలు ★మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు ఏప్రిల్ 15 : బ్రిటిష్ నియంత నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్రం సాధించి ఊపిరి పీల్చుకున్న భారతదేశానికి తన మేధో మదనంతో దిశా నిర్దేశం చేసిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.. దేశంలో నివసించే సబ్బండ వర్గాల భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందో ఆనాడే ప్రణాళికలు రచించి స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన యోగి… దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి కుల, మత, పేద, ధనిక, తరతమ లింగ బేధాలు లేకుండా సమసమానత్వ భావాన్ని ప్రసాదించి తద్వారా సమసమాజ నిర్మాణం వైపు మల్లేలా చేసిన గొప్ప మహనీయుడని మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఆనాడు ఎంతో దూర దృష్టితో ఆలోచించి ఆయన రచించిన రాజ్యాంగమే ప్రతి భారతీయునికి శిరోధార్యంగా మారింది.. వాటి ఫలితాలే ఈరోజు గిరిజన మహిళా భారత రాష్ట్రపతి పదవిని బీసీ బిడ్డ భారత ప్రధాని పదవిని అధిరోహించడం గొప్ప పరిణామం అన్నారు. ప్రతి భారతీయునికి దక్కాల్సిన హక్కులు ప్రతి భారతీయుడు నిర్వహించాల్సిన విధులను, ప్రభుత్వాలు పౌరులకు చేయాల్సిన బాధ్యతలను ఆనాడే క్రోడీకరించి భారత దేశ నూతన ప్రజాస్వామ్యానికి పునాది వేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వినమ్ర జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.