పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /15 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సర్పంచ్ ఎం.రాజు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సిరిసిల్ల అశోక్ , అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు తడకపెల్లి భూమయ్య , ఉపసర్పంచ్ మూగు నాగరాజ్ శర్మ, వార్డు సభ్యులు మామిడి శ్రీనివాస్, చేరాల వంశీకృష్ణ, రాకం సుమన్, అంతటి శ్రీకాంత్ గౌడ్, కునబోయిన రఘు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు,మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.