ఘనంగా డా.బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 దండేపల్లి దండేపల్లి మండల రెబ్బెనపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజలందరికీ డా.బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా రెబ్బనపల్లి గ్రామ ప్రజలు మరియు అంబేద్కర్ సంఘ నాయకులు మా రెబ్బెనపల్లి గ్రామానికి డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహదాత మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , గడ్డం త్రిమూర్తి అక్కల వెంకటేశ్వర్లు సర్పంచ్ కందుల కళ్యాణం అశోక్ ఉపసర్పంచ్ ఊరటి వినోద్ , సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.,