ఘనంగా135 వ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 15/04/2026 రూలర్ ప్రతినిధి బాసు అల్లూరి సీతా రామరాజుజిల్లా డుంబిరిగుడపట్టణ పరిధిలో ప్రతినిధి బాసు కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ జిఓ నెంబర్ 3 చట్టబద్ధత చట్టం తక్షణమే చెయ్యాలి? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడగూడ మండలతేదీ 14.04.2026న ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి మరియు అల్లూరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శతక బుల్లిబాబు ఆదేశాల మేరకు అరుకు పంచాయతీ నేరేడు వలస గ్రామములో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ 135వ జన్మదిన వేడుకలు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి బాల బాలికలు మహిళలు వృద్ధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చటారి సాయిబాబా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల వారికి ఒక దేవుడు అందరికీ హక్కులు చట్టాలు కల్పించిన మహానుభావుడు గిరిజన హక్కులు చట్టాలు ప్రస్తుత కేంద్రము బిజెపి కూటమి రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు చట్టాలు సక్రమంగా అమలు చేయకపోవడం చాలా దూరదృష్టకరము అన్యాయము గత ఎన్నికల్లో ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీ గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయకపోవడం వలన గత మెగా డీఎస్సీలో సుమారుగా 5 ఉపాద్య పోస్టులు నష్టపోవాల్సి వచ్చింది. జి ఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి ఐదో షెడ్యూల్ భూభాగం ఆక్రమణకు గురి అవుతుంది 1/ 70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తొలి సంతకం అమలు చేయాలి గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న హెల్త్ వాలంటీర్లను రెన్యువల్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము గిరిజన యువత బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ గిరిజన హక్కులు చట్టాలు కాపాడుకోవడానికి పోరాటం చేయాలని యువతకు సాయిబాబా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కిషన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ ఓబిసి అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్ ఆదివాసి కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు సమరెడ్డి బంగారు రాజు యూత్ కాంగ్రెస్ నాయకులు కుమ్మిశెట్టి అచ్చిబాబు. సాయి నాగేశ్వరరావు నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున తదితరులు పాల్గొన్నారు